Balakrishna New Record: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య

0
52

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో థియేటర్లలోనే సంచలనం సృష్టిస్తున్న బాలయ్య తన అద్భుతమైన నటనతో రికార్డులు కొల్లగొడుతున్నారు. అంతేకాదు తాజాగా యూఎస్ మార్కెట్లో అరుదైన రికార్డును సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి బాలయ్య సాధించిన ఆ రికార్డు ఏంటో తెలుసుకుందాం !

బాలయ్య సరికొత్త రికార్డు..

గాడ్ ఆఫ్ మోసెస్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. హర్షాలీ మల్హోత్ర కీలకపాత్ర పోషించారు. 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్ కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో బాలయ్య అమెరికాలో అరుదైన ట్రాక్ రికార్డును నమోదు చేసుకున్నారు. అంతేకాదు నార్త్ అమెరికాలో బాలయ్య నటించిన ఐదు సినిమాలు వరుసగా వన్ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం విశేషం.

ఆరు చిత్రాలలో రికార్డ్ సృష్టించిన బాలయ్య..

అలా బాలకృష్ణ నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమహారాజ్, అఖండ 2 ఇలా వరుసగా ఐదు సినిమాలు ఒక మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసి బాలయ్యకు అరుదైన ట్రాక్ రికార్డును అందించాయి. అంతేకాదు గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా మిలియన్ డాలర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే బాలయ్య ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు వచ్చి చేరాయి. అలా ఈ రికార్డు సాధించిన ఏకైక హీరోగా బాలయ్య సంచలనం సృష్టించారు. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలు..

బాలయ్య అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. గతంలో వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య అదే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల తేదీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అలాగే ఆదిత్య 999 సినిమాలో కూడా బాలయ్య నటిస్తున్నారు. 1991లో క్లాసిక్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు క్రిష్ జాగర్లమూడితో ఈ సినిమాను చేయడమే కాకుండా ఈ సినిమా ద్వారా తన కొడుకు మోక్షజ్ఞని కూడా లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాలో కూడా బాలయ్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Leave a reply