Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది?

Best premium phone in Indian Market
0
77

స్మార్ట్ ఫోన్  ప్రపంచంలో ప్రీమియం ఫ్లాగ్లిప్ సెగ్మెంట్ మరింత పోటీగా మారుతున్న సమయంలో, షావోమీ 17 అల్ట్రా ఇంకా పిక్సెల్ 10 ప్రో రెండు కూడా టాప్ క్లాస్ అనుభవాన్ని అందిస్తామని చెప్పే ఫోన్లుగా మార్కెట్లో నిలిచాయి. పవర్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వంటి అంశాల్లో ఈ రెండు ఫోన్లు ఏ స్థాయిలో ఉన్నాయి, వాడకంలో నిజంగా ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, రోజువారీ అనుభవంలో ఏ ఫోన్ మీద ఎక్కువ నమ్మకం ఏర్పడుతుంది అనే విషయాలు చాలామందిలో సందేహంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఉన్న ఫీచర్లు, పర్ఫార్మెన్స్ నుంచి కెమెరా వరకూ ప్రతి అంశాన్ని చూసి, ప్రీమియం సెగ్మెంట్లో ఏది బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.

బిల్డ్ ఇంకా ఫీల్..

Xiaomi17Ultra పక్కాగా ఒక పవర్ఫుల్ టూల్లా అనిపిస్తుంది. ఆ భారీ లైకా కెమెరా మాడ్యూల్, బోల్డ్ లుక్ చూస్తుంటే పవర్ యూజర్ల కోసం తయారుచేసిన ప్రొఫెషనల్ ఫోన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. దీనికి పూర్తి భిన్నంగా పిక్సెల్ 10 ప్రో చాలా సాఫ్ట్, క్లాసీగా ఉంటుంది. ఆ పాలిష్డ్ గ్లాస్ ఫినిష్, నీట్ డిజైన్ రోజూ వాడే వారికి ఒక రిలాక్స్డ్ ప్రీమియం అనుభవాన్ని ఇస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, షియోమీ ఒక ‘రఫ్ అండ్ టఫ్’ మెషిన్ లాంటిదైతే, పిక్సెల్ ఒక అందమైన ‘లైఫ్ స్టైల్’ స్టేట్మెంట్లా ఉంటుంది.

డిస్ప్లే అనుభవం..

షియోమీ 17 అల్ట్రా అమోలెడ్ డిస్ప్లే అగ్రెసివ్ బ్రైట్నెస్, హై కాంట్రాస్ట్లో విజువల్స్ విషయంలో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గేమింగ్ లేదా హై-క్వాలిటీ హెచ్ఎఆర్ వీడియోలు చూసేటప్పుడు దీనిలోని డ్రామాటిక్ కలర్స్ కంటెంట్ను మరింత ఆకర్షణీయంగా, లైవ్ మారుస్తాయి. మరోవైపు, పిక్సెల్ 10 ప్రో డిస్ప్లే పూర్తి నేచురల్ ట్యూనింగ్, షార్ప్ నెస్కు ప్రాధాన్యతనిస్తుంది. ఇది ఎక్కడా రంగులు వాస్తవానికి దగ్గరగా ఉంటూ, బ్రౌజింగ్ లేదా లాంగ్ వీడియోలు చూసేటప్పుడు కళ్లకు తగినంత సౌకర్యాన్ని ఇస్తుంది. లాంగ్ వీడియోలు చూసే వారికి మెరుగైన ఆప్షన్గా నిలుస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో ఏది బెస్ట్..?

షియోమీ 17 అల్ట్రా లోని స్నాప్డ్ డ్రాగన్ ప్లాట్ఫామ్, ఫాస్ట్ స్టోరేజ్ కలిసి హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, క్రియేటివ్ వర్క్ ఎలాంటి ల్యాగ్ లేకుండా పని చేస్తాయి. ఇది స్పష్టంగా పవర్ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడింది. పిక్సెల్ 10 ప్రో లోని టెన్సర్ G5 చిప్ రా స్పీడ్ కంటే AI ఎఫిషియెన్సీ మీద దృష్టి పెడుతుంది. రోజువారీ యాప్ వాడకంలో సిస్టమ్ చాలా స్మూత్గా, ఇంటెలిజెంట్గా ప్రవర్తిస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ కన్నా యూజర్ అనుభవాన్ని ముందుకు తెస్తుంది.

బ్యాటరీ ఇంకా ఛార్జింగ్..

షియోమీ 17 అల్ట్రా పెద్ద బ్యాటరీతో పాటు చాలా ఫాస్ట్ వైర్డ్ ఇంకా వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. కొద్దిసేపు ఛార్జ్ పెట్టినా ఎక్కువ శాతం బ్యాటరీ తిరిగి రావడం హెవీ యూజ్ చేసే వారికి పెద్ద ప్లస్ పాయింట్. పిక్సెల్ 10 ప్రో ఛార్జింగ్ స్పీడ్ విషయంలో కంట్రోల్స్ అప్రోచ్ తీసుకుంటుంది. బ్యాటరీ హెల్త్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.

కెమెరా అనుభవం..

షియోమీ 17 అల్ట్రా లైకా ట్యూన్ చేసిన కెమెరా సిస్టమ్, కంటిన్యూయస్ ఆప్టికల్ జూమ్ వల్ల క్రియేటివ్ ఫోటోగ్రఫీకి చాలా ఉపయోగపడుతుంది. లో లైట్, జూమ్ షాట్స్లో ఫోటోలు టెక్స్చర్డ్, సినిమాటిక్ టోన్తో కనిపిస్తాయి. పిక్సెల్ 10 ప్రో కెమెరా కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి ఉంటుంది.

ధర విషయంలో ఏది బెస్ట్?

భారత మార్కెట్లో షియోమీ 17 అల్ట్రా ధర సుమారు రూ. 1,09,999 గా ఉండే అవకాశం ఉండగా, పిక్సెల్ 10 ప్రో ధర రూ. 1,04,999 నుండి ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల మధ్య ధర వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ, షియోమీ అందిస్తున్న పవర్ఫుల్ హార్డ్వేర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా సెటప్ను పరంగా చూస్తే, పెట్టే డబ్బుకు తిరిగి వచ్చే విలువ కొంచెం ఎక్కువగా షియోమీ వైపే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ధర పరంగా కూడా షియోమీ 17 అల్ట్రానే మంచి డీల్గా కనిపిస్తోంది.

 ఏది ది  బెస్ట్..?

ఒకే ఫోన్ ఎంచుకోవాల్సి వస్తే, ఎక్కువ ఫీచర్లు, ఎక్కువ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, వర్సటైల్ కెమెరా కావాలనుకునే వారికి షియోమీ 17 అల్ట్రానే బెస్ట్ ఎంపిక. ఇది ఈ ధర స్థాయిలో హార్డ్వేర్ పరంగా ఎక్కువ ఇస్తుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రోజువారీ వాడకంలో ప్రశాంతమైన అనుభవం, లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు ముఖ్యమైతే పిక్సెల్ 10 ప్రో మంచి ఎంపికగా ఉంటుంది. కానీ మొత్తం ప్యాకేజ్ చూసినప్పుడు, ఎక్కువ విలువ ఇచ్చేది మాత్రం షియోమీ 17 అల్ట్రానే.

Leave a reply