Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ

Somnath Temple in Gujarat,a Historic icon of Devotion
భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ ఆలయం(Somnath Temple). భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం…. కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తికి… అంచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. సోమనాథ్ శివలింగాన్ని దర్శించుకుంటే జీవుడు పాప విముక్తుడై… మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. సోమనాథ్ ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు… భారతీయతకు హిందూ ధర్మానికి ఉన్న తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక. కొన్ని వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో దాడులు… విద్వంసాలను ఎదుర్కొన్న ప్రతిసారీ… మరింత వైభవంగా పునర్నిర్మితమైన ఈ ఆలయ చరిత్ర ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ ఆలయ చరిత్రను ‘Somnath Temple legacy’ గా పిలవాలి.
ఈ పవిత్ర క్షేత్రంపై అనేకమంది దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు.ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సోమనాథ్ ఆలయంపై తొలి దాడికి వెయ్యేళ్ళు పూర్తవుతుంది.1026వ సంవత్సరం జనవరిలో గజని మెహ్మద్ క్రూరమైన హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ఆలయ సంపదను దోచుకెళ్ళారు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశారు. ఆ తర్వాత 1299లో అలావుద్దీన్ ఖిల్జీ 1995లో జావర్ ఖాన్ 1451లో మెహమూద్ బెగ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు .ఔరంగజేబు కూడా ఆలయాన్ని పునరుద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలని ఆదేశించాడు.సుమారు 17 సార్లు సోమనాథ్ ఆలయం దాడులకు దోపిడీలకు గురయింది.ఇలాంటి ఎన్నో దాడులు జరిగినా కూడా.. సోమనాథ్ ఆలయం తిరిగి నిలబడింది.దాడులు జరిగినప్పుడల్లా…. స్థానిక రాజులు భక్తులు వెనకడుగు వేయకుండా ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్షేత్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
ఈ పవిత్ర క్షేత్రంపై అనేకమంది దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు.ఈ ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సోమనాథ్ ఆలయంపై తొలి దాడికి వెయ్యేళ్ళు పూర్తవుతుంది. 1026వ సంవత్సరం జనవరిలో గజని మెహ్మద్ క్రూరమైన హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ఆలయ సంపదను దోచుకెళ్ళారు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశారు. ఆ తర్వాత 1299లో అలావుద్దీన్ ఖిల్జీ 1995లో జావర్ ఖాన్ 1451లో మెహమూద్ బెగ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఔరంగజేబు కూడా ఆలయాన్ని పునరుద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలని ఆదేశించాడు. సుమారు 17 సార్లు సోమనాథ్ ఆలయం దాడులకు దోపిడీలకు గురయింది. ఇలాంటి ఎన్నో దాడులు జరిగినా కూడా.. సోమనాథ్ ఆలయం తిరిగి నిలబడింది. దాడులు జరిగినప్పుడల్లా…. స్థానిక రాజులు భక్తులు వెనకడుగు వేయకుండా ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా క్షేత్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
Somnath Temple legacy: సోమనాథ్ ఆలయ పురాణ గాధ..
సోమనాథ్ ఆలయానికి ఎన్నో వేల చరిత్రతో పాటు ఓ అద్బుతమైన పురాణ గాధ కూడా ఉంది. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.పురాణాల ప్రకారం… దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వీరినే 27 నక్షత్రాలుగా భావిస్తారు. వీళ్ళందరినీ చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూడకుండా కేవలం రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమాభిమానాలు చూపించేవాడు. మిగిలిన కుమార్తెలు తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేయడంతో ఆయన చంద్రుడిని మందలిస్తాడు .అయిన చంద్రుడిలో మార్పు రాకపోవడంతో క్షయ రోగంతో కాంతిహీనుడివై నశించిపోతావని దక్షుడు చంద్రుడిని శపిస్తాడు.శాప ప్రభావంతో చంద్రుడిలో కాంతి కోల్పోవటం మొదలై లోకమంతా అంధకారం అలుముకుంటుంది.దాంతో కలత చెందిన చంద్రుడు బ్రహ్మదేవుని సలహ మేరకు సోమనాథ క్షేత్రానికి చేరుకుంటాడు .అక్కడ సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట మృత్యుంజయ మంత్రాన్ని పటిస్తూ పరమశివుని కోసం తపస్సు చేస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు దక్షిణి శాపాన్ని పూర్తిగా తొలగించలేనని దాని ప్రభావాన్ని తగ్గిస్తానని అభయం ఇస్తాడు .అలా చంద్రుడు కృష్ణ పక్షంలో తన కాంతిని కోల్పోతూ ఉంటాడు.మళ్ళీ శుక్ల పక్షంలో క్రమంగా తన కళని పెంచుకుంటూ పౌర్ణమి నాటికి పూర్తి కాంతితో వెలిగిపోతాడు. తనకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతగా…. చంద్రుడు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడని పురాణ గాధ చెప్పబడింది.చంద్రుడిని సోముడని పిలుస్తారు కాబట్టి ఈ స్వామికి సోమనాథుడు అని పేరు వచ్చింది.చంద్రుడికి మాట ఇచ్చిన ప్రకారం.. శివుడు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అప్పటి నుంచి భక్తులకు దర్శనం ఇస్తూ పాపాల నుంచి విముక్తి కలిగిస్తున్నాడు.
సోమనాథ్ ఆలయానికి మరో ఓ విశిష్టత కూడా ఉంది.ఆలయ ప్రాంగణంలో సముద్ర తీరాన ఓ బాణ స్తంభం ఉంటుంది. దానిపై ఉన్న శాసనం ప్రకారం… ఆ స్తంభం ఉన్న చోటు నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడ ఎలాంటి భూభాగం అడ్డు రాదు అంటే ఆ బాణస్తంభం నుంచి నేరుగా దక్షిణ ధ్రువం వరకు కేవలం సముద్రమే ఉంటుంది. ప్రాచీన కాలంలో భారతీయులకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనమని చరిత్రకారులు చెప్తున్నారు. అలా ఎంతో పురాణ గాధ ఉన్నసోమనాథ్ ఆలయం పై వెయ్యేళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1026 జనవరిలో విదేశీ ఆక్రమణదారుడైన మహమ్మద్ గజని దాడి చేసి ధ్వంసం చేసాడు. ఆ తరువాత ఎన్నో సార్లు ఆలయం పై దాడులు జరిగాయి. అయితే ఆక్రమణదారులు ఆలయాన్ని పడగొట్టగలిగారు కానీ భారతీయుల మనసులో ఉన్న ధర్మాన్ని,శివతత్వాన్ని మాత్రం చెరపలేకపోయారు.
Somnath Temple Legacy Through Time..సోమనాథ్ ఆలయానికి పునర్వైభవం..!
మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత… సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను సర్దార్ వల్లభాయి పటేల్ తీసుకున్నారు. 1947 దీపావళి సమయంలో ఆయన ఆలయాన్ని అదే ప్రాంతంలో తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మే 11 1951న సోమనాథ్ ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ గొప్ప ఘట్టాన్ని చూసేందుకు సర్దార్ పటేల్ భూమి మీద లేరు.ఇదే సమయంలో మాజీ ప్రధాని నెహ్రూ సోమనాథ్ ఆలయం పై అంతటి శ్రద్ధ కనపరచలేదని విమర్శలు కూడా ఉన్నాయి.కానీ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణ విషయంలో దృడంగా నిలబడ్డారు.సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెళ్ళడాన్ని నెహ్రూ వ్యతిరేకించినా నెహ్రూ అభ్యంతరాన్ని తోసిపుచ్చి… వ్యక్తిగత హోదాలో వెళ్లి సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.మతోన్మాదాలకు తాత్కాలికంగా విధ్వంసం సృష్టించే శక్తి ఉండొచ్చు కానీ సత్యం ధర్మంపై ఉన్న నమ్మకం ఎప్పటికీ ఓడిపోవని ఈ క్షేత్రం చాటి చెప్తుంది. మన దేశ సంస్కృతిని నమ్మకాన్ని దాడులతో అణచి వేయలేమని ఈ వెయ్యేళ్ల చరిత్ర నిరూపించింది.
విదేశీయులు తొలిసారి దాడి చేసి ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్ళ అవుతున్న క్రమంలో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ పేరుతో ఈ ఏడాదంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల ఎనిమిది నుంచి 11వ తేదీ వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి.సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం ఓ కట్టడం గురించిన కథ కాదు…. అణచివేతలను తట్టుకొని ఓ జాతి తిరిగి లేచి నిలబడిన తీరుకు నిదర్శనం.మన సంస్కృతి నాగరికతను కాపాడిన కోట్లాది మంది భారతీయుల అజయమైన సాహస గాధ…. సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం.



