Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

మోటరోలా తన కొత్త ప్రీమియం సిగ్నేచర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, జనవరి 7, 2026న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఒక ఫ్లాగ్‌షిప్ అవుతుందని భావిస్తున్నారు. ఇది మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా రీబ్రాండెడ్ వెర్షన్ అని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా. దీనికి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. మోటరోలా సిగ్నేచర్ ఫోన్ అంచనా ధర, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకుందాం…
ఈ సిరీస్‌ను ఫుల్ ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకురావాలని మోటరోలా ప్లాన్ చేస్తోంది. ఇందులో 6.7 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ పనితీరు అందించనుందని సమాచారం. అలాగే IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, Android 16 సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మోటరోలా సిగ్నేచర్ సిరీస్‌లో స్టైలస్ సపోర్ట్ ఉండటం వల్ల ఇది హైఎండ్ ప్రొడక్టివిటీ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Motorola Signature Launch Date…
మోటరోలా సిగ్నేచర్ ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC ప్రాసెసర్ ఉంటుందని ఇది సూచిస్తుంది. ఈ ఫోన్ స్టైలస్ సపోర్ట్‌ను అందించవచ్చని సూచించే లీక్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర సుమారు 60వేల నుంచి 70వేల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది జనవరి 7, 2026న భారతదేశంలో విడుదల కావడం ఖాయమైంది.
Motorola Signature Specifications….
మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ 50MP సెన్సార్ లభించే అవకాశం ఉంది. ఇందులో OISతో కూడిన ప్రైమరీ సోనీ లైటియా సెన్సార్ ఉంటుంది. దీనితో పాటు భారీ 5000mAh నుండి 6500mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వచ్చు. మోటరోలా సిగ్నేచర్ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఇందులో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేటింగ్ ఉంటుందని భావిస్తున్నారు.
దీనికి స్టైలస్ సపోర్ట్, పక్కన అదనపు కస్టమైజ్ బటన్ కూడా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో 829 GPUతో పనిచేసే అవకాశం ఉంది. ఇందులో 16జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ లేదా 512జీబీ వరకు స్టోరేజ్‌తో వస్తుందని అంచనా, ఇది దీనిని ప్రీమియం విభాగంలో నిలబెడుతుంది. ఈ ఫోన్ మోటరోలా హలో UIతో కూడిన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని భావిస్తున్నారు.



