Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..!

సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్‌గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్‌లో కాస్త ఎక్కువగా తాగేస్తుంటారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్‌తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ కొన్ని హోమ్ రెమిడీలతో మీరు హ్యాంగోవర్ తగ్గించుకోవచ్చు. ఇవి మీ హ్యాంగోవర్ తగ్గించడమే కాకుండా మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి. ఇంతకీ ఆ హోమ్ రెమిడీలు ఏంటో ఓ లుక్కేద్దాం.
హ్యాంగోవర్ పెయిన్..
హ్యాంగోవర్లో కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి అల్లం మంచి ఓదార్పునిస్తుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి తాగడం లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదంటే మీరు అల్లంతో తయారు చేసిన ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇది మీ హ్యాంగోవర్ తగ్గించడంలో సహాయపడుతుంది.
హైడ్రేషన్..
హ్యాంగోవర్‌ను తగ్గించడం కోసం మీరు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది తలనొప్పి, నీరసానికి దారితీస్తుంది. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో డీహైడ్రేషన్ తగ్గి.. మీకు ఎనర్జీ వస్తుంది. అవసరమైన పోషకాలను పునరుద్ధరించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా టాక్సిన్లను బయటకు పంపి హ్యాంగోవర్ తగ్గిస్తాయి.
నిమ్మ లేదా ఆరెంజ్ జ్యూస్..
మద్యపానం.. మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి హ్యాంగోవర్ సమయంలో మీ శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి మీరు సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్‌లు తాగవచ్చు. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పానీయాలు హ్యాంగోవర్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలోని విటమిన్ సి శరీరానికి అదనపు ఎనర్జీని అందిస్తుంది. అంతేకాకుండా సిట్రస్ పండ్లు ఆల్కహాల్‌ను వేగంగా జీర్ణం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.
పోషకాహార ఫుడ్..
పోషకాలు అధికంగా ఉండే ఫుడ్‌ని తీసుకోండి. హ్యాంగోవర్ తర్వాత శరీర సమతుల్యతను పునరుద్ధరించడానికి నీరు, ఎలక్ట్రోలైట్ పానీయాలు కొబ్బరి నీరు, తేలికపాటి ఆహారం, విశ్రాంతి చాలా హెల్ప్ చేస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆకుకూరలు, సిట్రస్ పండ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఫుడ్ తీసుకోవచ్చు. పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ పెరుగుతాయి. కండరాల తిమ్మిరి, అలసట తగ్గుతుంది.
పుదీనా..
పుదీనా అజీర్ణం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు హ్యాంగోవర్‌తో ఉన్నప్పుడు ఉదయాన్నే పుదీనా టీ కూడా తాగొచ్చు. కడుపు నొప్పి, మంటను తగ్గించుకోవడానికి పుదీనా ఆకు వాడకం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎందుకంటే దానిలోని మెంథాల్ జీర్ణవ్యవస్థ కండరాలను రిలాక్స్ చేసి, గ్యాస్‌ను తగ్గిస్తుంది. తాజాదనాన్ని ఇస్తుంది. హ్యాంగోవర్ నుండి కూడా కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని టీ రూపంలో తాగడం, లేదా నేరుగా నమలడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇవన్నీ మీరు హ్యాంగోవర్ నుంచి బయటపడడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ మీరు కంట్రోల్‌గా తాగితేనే మంచిది. అధికంగా ఆల్కహాల్ తాగడమనేది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పార్టీ అంటే కేవలం తాగడం ఒక్కటే కాదు.. ఎంజాయ్ చేయడమని కూడా గుర్తిస్తే అసలు హ్యాంగోవర్ సమస్యనే ఉండదు.





